Tuesday, November 19, 2024

మూడు నిమిషాల్లో మూడున్న‌ర కిలోల పెరుగు తిని.. రికార్డ్ సృష్టించిన వ్య‌క్తి

పెరుగు తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌చారం చేసేందుకు బీహార్ పాట్నాలో స్థానిక సుధా డైరీ గ‌త ప‌దేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వ‌హిస్తుంది. కాగా ఈ పోటీలో ఒక వ్యక్తి రికార్డ్‌ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్‌ విభాగాల్లో సుమారు 500 మంది పోటీ పడ్డారు. పురుషుల విభాగంలో బార్హ్‌ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగు తిన్నాడు. మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ తివారీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తిన్నారు. సీనియర్ సిటిజన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ముగ్గురూ ‘దహీ శ్రీ’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 2020లో కూడా శంకర్ కాంత్ 4 కిలోల పెరుగు తిని ఈ టైటిల్‌ను గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement