లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కష్టాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్నినాని సమావేశమయ్యారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించాము. ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపింది’ మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలోని విషయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు రకరకాల అంశాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. చిరంజీవంటే సీఎం జగనుకు ఇష్టమే.. సోదర భావంతో ఉంటారు. ఆయన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఏపీలో షూటింగులు చేస్తున్నామనే చెప్పారు. స్టోరీ డిమాండ్ చేసిన దాని బట్టి ఏపీలో కూడా షూటింగ్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు’ అని మంత్రి పేర్నినాని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తోంది: షర్మిల