బీజేపీ బహిరంగ సభకు అడ్డంకి వచ్చింది. ఎల్లుండి హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పర్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. పోలీసుల నుంచి ఎట్లాంటి పర్మిషన్ లేనందున ఈ సభ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రిన్సిపల్ లెటర్ ద్వారా తెలియజేశారు. తమకు ఇచ్చిన 5 లక్షల రూపాయలను వాపస్ ఇస్తామని, సభకు కాలేజీ మైదానంలో పర్మిషన్ ఇవ్వబోమన్నారు కాలేజీ ప్రిన్సిపల్.
దీంతో బీజేపీ లీడర్లు డైలామాలో పడ్డారు. మరో వేదిక వేతుక్కునే పనిలో అక్కడి లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి జరగాల్సిన సభకు ఉన్నట్టుండి పర్మిషన్ క్యాన్సిల్ కావడం వెనకాల టీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.