Saturday, November 23, 2024

ప‌ర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు – షాక్ అయిన ఐటీ అధికారులు

ప‌ర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. వ్యాపారి ఇంటినిండా నోట్ల క‌ట్ట‌లు క‌నిపించ‌డంతో ఐటీ అధికారులే షాక్ కి గుర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.150కోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. వ్యాపారి పీయూష్ జైన్ పై ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా ఇంట్లో అనుమానాస్పదంగా రెండు అల్మారాలు కనిపించాయి. వాటిని ఓపెన్‌ చేసి చూడగా ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో ఐటీ అధికారులు బ్యాంక్‌ అధికారులను పిలిపించారు. మూడు కౌంటింగ్‌ మిషన్లతో డబ్బులను లెక్కించడం ప్రారంభించారు. నిన్న సాయంత్రం నుంచి ఈ నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతుండగా.. శుక్రవారం ఉదయం వరకు రూ. 150 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతుందని అధికారులు వెల్ల‌డించారు. పీయూష్‌ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ అనుచరుడిగా ఉన్నారు. ఆపార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీతో ప్రత్యేకంగా ఓ పర్ఫ్యూమ్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు పీయూష్‌. కాగా పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది బీజేపీ. ‘ఎస్పీ’ అవినీతి వాసన ఇది అంటూ పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీసీఐ( డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌) అధికారులు కూడా పీయూష్‌ ఇంటికి చేరుకున్నారు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఊహజనిత కంపెనీలతో నకిలీ బిల్లులను పీయూస్‌ సృష్టించారని, జీఎస్‌టీ పన్నులు ఎగ్గొట్టారని విచారణలో తేలింది. కాన్పూర్‌లోని ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాలు, గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఇందులో భాగంగా ఓ వేర్‌ హౌస్‌లో నకిలీ ఇన్‌వైజ్ లు ఉన్న నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement