శ్రీలంకలో ప్రజల తిరుగుబాటు మొదలైంది. మొరటువా మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో, ఎంపీలు సనత్ నిశాంత, రమేష్ పతిరనా, నిమల్ లాంజా అధికారిక నివాసాలకు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇంటర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (IUSF)తో సహా పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. కాగా, ఇవ్వాల రాత్రి కొద్దిసేపటి క్రితం లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు.
దేశం ఘోరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. దానికి తాను, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేసి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన ఇవ్వాల ప్రకటించారు. పార్లమెంటులో పార్టీ నాయకులు డిమాండ్‌ని తాము స్వీకరిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామాను ప్రకటించారు.
అంతేకాకుండా.. శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబోలో వేలాది మంది నిరసనకారులు శనివారం అధ్యక్షుడి అధికారిక నివాసం, ఆయన సచివాలయాన్ని ముట్టడించారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శనివారం కొలంబోలోని తన అధికారిక నివాసం నుండి పారిపోయారు. ఇంతలో, రాష్ట్రపతి తన నివాసం నుండి పారిపోవడంతో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తన క్యాబినెట్ మంత్రితో అత్యవసర సమావేశాన్ని పిలిచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.