భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ న్యాయ వ్యవస్థపై జనంలోని అభిప్రాయాన్ని సెటైరికల్‌గా చెప్పారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా త్వరిత గతిన న్యాయం దక్కాలని జనం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇన్‌స్టంట్ నూడిల్స్ మాదిరిగా జనం ఇన్ స్టంట్ జస్టిస్ కావాలనుకుంటున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఫలితంగా నిజమైన బాధితులకు న్యాయం దక్కడం లేదని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఏదైనా లోతుగా దర్యాప్తు చేయాల్సిందేనని అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో స్థానిక భాష వాడితే బాగుంటుందని సీజేఐ అభిప్రాయపడ్డారు.