కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 150 కోట్లతో 900 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్న మంత్రి హరీశ్.. టీకా వేయించుకోని వారు త్వరగా వేయించుకోవాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement