Wednesday, November 20, 2024

అయ్య బాబోయ్.. ఒక్క బల్బుకు 12 వేల బిల్లా?!

పేద గృహ వినియోగదారులకు చేతికందిన విద్యుత్‌ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రూ.300 నుంచి 300 వచ్చే వినియోగదారులకు ఏకంగా వేలల్లో బిల్లులు జారీ కావడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్ద బంగళాకు రావాల్సిన బిల్లు తనకు రావడంతో బాధితురాలు లబోదిబోమంటున్నారు. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకొనే తనకు ఇంత కరెంటు బిల్లు  రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి ఇంటికి ఒక్క లైటు మాత్రమే ఉండే ఇంటికి కరెంట్ బిల్ రూ. 12,500 వచ్చింది.. ఇదేంటని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే మాకేం తెలియదు బిల్ మొత్తం కట్టాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో రోడ్డెక్కిన బాధితులు.. విద్యుత్ శాఖామంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

కలహండిలో నివాసం ఉండే కొంతమంది పేదలకు విపరీతంగా కరెంట్ బిల్ వేశారు. దింతో వారు రోడ్డెక్కారు. తమకు కరెంట్ బిల్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఒడిశా విద్యుత్ శాఖామంత్రి దిబ్యా శంకర్ మిశ్రా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన కరుణకర్ సాగర్ మాట్లాడుతూ.. “నేను చాలా పేదవాడిని.. ఇంట్లో ఒక్క బల్బును మాత్రమే ఉపయోగిస్తున్నాను. రూ.300 నుంచి 500 రూపాయల వరకు వస్తే చెల్లించగలను. కానీ, నాకు ఇప్పుడు రూ .12,500 వచ్చింది ఎలా కట్టగలను. అసలు అంత బిల్లును నేను ఎందుకు చెల్లించాలి? బల్బ్ వెలిగించటానికి ఎంత ఖర్చవుతుంది? కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా రూ.500 బిల్లు వచ్చిందని తీసుకున్నారు. ఇప్పుడు రూ .12,500 కరెంట్ బిల్లు వచ్చింది కట్టమంటూ డిమాండ్ చేస్తున్నారు” అని వాపోయారు.

మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యప్రజలపై భారం వేస్తుందని మండిపడ్డారు. పేద కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే దీనిపై దీక్ష చేపడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement