Friday, November 22, 2024

ఇజ్రాయిల్‌లో తొక్కిసలాట.. 44 మంది మృతి

ఇజ్రాయిల్‌లోని మౌంట్‌ మెరెన్‌ పవిత్ర స్థలం వద్ద విషాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. యూదుల పండుగ లాగ్‌ బౌమర్‌ పండుగ సందర్భంగా వేలాది మంది యూదులు మెరెన్‌కు ప్రార్థనల కోసం తరలివచ్చిన సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందారని హిబ్రూ మీడియా తెలిపింది. అయితే తొక్కిసలాటకు కారణాలు మాత్రం తెలియరాలేదు. పవిత్ర స్థలం వద్ద ఏర్పాటు చేసిన కచేరీ స్టాండ్‌ పైకప్పు కూలడంతో దుర్ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా సమాచారం అందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియాల్లో యూదులు ఒకే చోట వేలాదిగా గుమిగూడినట్లు కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఒకే మూలకు తోసుకువచ్చారంటూ ఘటనలో గాయపడ్డ ఓ యువకుడు తెలిపాడు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్న వారంతా కిందపడిపోయారని చెప్పాడు. తర్వాత రెండో వరుసలో ఉన్న వారంతా వారిపై పడిపోయారని.. వెనుక ఉన్న వారంతా తమను నెట్టుకుంటూ మీద పడ్డారని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement