శ్రీలంక వీధుల్లో కోలాహలం నెలకొంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో సంబరాలు చేసుకున్నారు అక్కడి ప్రజలు.ఈ సందర్భంగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమల్లో ఉన్న కర్ఫ్యూను ధిక్కరించి మరీ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ‘గొటా గో గామా’ నిరసన ప్రదేశంలో గొటబాయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మెరుగైన పాలన కావాలని మరికొందరు నినాదాలతో హోరెత్తించారు. తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, అధ్యక్ష భవనాన్ని ప్రజలు ముట్టడించడంతో గొటబాయ గత వారం అధ్యక్ష భవనాన్ని విడిచి పరారయ్యారు. మొన్న మాల్దీవులకు పారిపోయిన ఆయన నిన్న సాయంత్రం అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement