అనంతరపురం జిల్లా పెన్ననది మరోసారి వరదపోటుకి గురయింది. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. ఈ మేరకు పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లని ఎత్తివేశారు. కండలేరు జలాశయంలోనూ నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ నుంచి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి.. అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తివేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement