యూపీలో తొలివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఉదయం 7గంటల నుంచి .. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చాడు. కొద్ది గంటల్లో పెళ్లి ఉన్నా ..ఓటు వేయడం బాధ్యతగా భావించి తన పనిని పూర్తి చేశాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన అంకుర్ బల్యాన్ వివాహం నేడు జరగనుంది. పెళ్లికి ముందు అంకుర్ బల్యాన్.. పోలింగ్ బూతుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పెళ్లి దుస్తుల్లో పోలింగ్ బూత్‌కు వచ్చిన అంకుర్‌ను మీడియా ప్రతినిధులు పలకరించగా.. ‘ముందు ఓటింగ్, ఆ తర్వాతే భార్య, తర్వాత అన్ని పనులు’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..