కేంద్ర బడ్జెట్‌ను జీరో బడ్జెట్‌గా విమర్శించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తూ ఇదంతా ‘పెగాసస్ స్పిన్ బడ్జెట్’ అని అభివర్ణించారు. సామాన్య ప్రజలకు చేకూరేది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో నలిగిపోతున్న సామాన్య ప్రజలకు ఈసారి బడ్జెట్లో దక్కిందేమీ లేదని, ప్రభుత్వం పెద్ద పెద్ద పదాలతో గొప్పలు చెబుతోందని విమర్శించారు మమతా బెనర్జీ..
కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో.. ఆ తర్వాత రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టారు. దిగువ సభలో బడ్జెట్‌ను సమర్పించిన సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు.. ఇది అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే అత్యధికమని, యూనియన్ బడ్జెట్ 2022-23 రాబోయే 25 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థకు పునాది వేయాలని చెబుతూ.. ఇది మున్ముందు బ్లూప్రింట్ గా ఉంటుందని అభివర్ణించారు.