ప్రభాన్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : రైల్వేల విషయంలో కేంద్రం కేటాయింపులు దారుణంగా ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లైన్ కు ఇచ్చిన మొత్తం వెయ్యి రూపాయిలే .. కాగితం ఖర్చులకు కూడా సరిపోవని ఉమ్మడి జిల్లా
ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు అర కొరగా నిధులు కేటాయించారని అంటున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొత్త రైల్వే లైనుకు మరి దారుణంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. గత బడ్జెట్ లో 350 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడు తగ్గించింది. మణుగూరు-రామగుండం, కొండపల్లి-కొత్తగూడెం మధ్య కొత్త లైన్లను ప్రతిపాదించినప్పటికీ వాటికి రూ.1000 మాత్రమే నిధులిచ్చారు. మందమర్రి- రాఘవాపురం మధ్య మూడో రైల్వేలైను ప్రతిపాదన ఇప్పటికే ఉన్నప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ల నిర్మాణాలకు కూడా నామమాత్రంగా నిధులిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..