కైవ్ నగరంలోని రెండు క్షిపణులను రష్యా ప్రయోగించింది. కైవ్ సిటీ సెంటర్ కు నైరుతి ప్రాంతాలకు తాకినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అందులో ఒకటి Zhulyany airport సమీపంలోని ప్రాంతాన్ని తాకినట్టుగా తెలిపారు. క్షిపణులు సెవాస్టోపోల్ స్క్వేర్ సమీపంలోని ప్రాంతాన్ని తాకినట్లు మరొక సాక్షి చెప్పారు. కైవ్ నగరంలోని ఓ ఎత్తైన నివాస భవనాన్ని క్షిపణి ఢీకొట్టినట్టుగా ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా.. ‘మన అద్భుతమైన కైవ్ నగరంపై రష్యా బలగాలు క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నారు. కైవ్‌లోని నివాస అపార్ట్‌మెంట్‌ను ఒక మిస్సైల్ తాకింది. రష్యాను పూర్తిగా వేరు చేయాలని నేను ప్రపంచాన్ని కోరుతున్నారు. చమురు ఆంక్షలు, దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేయండని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement