వంట గ్యాస్ ధర పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. అయితే ఇట్లాంటి సిచ్యుయేషన్‌లో తక్కువ ధరకే సిలిండర్ బుక్ చేసుకునే చాన్స్ వస్తే ఎవరు కాదంటారు…ఇప్పుడా అవకాశం పేటీఎం యాప్ కల్పిస్తోంది.. మరి ఆదేలా సాధ్యమో చదివి తెలుసుకోండి..
పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్ పొందే వీలుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రూ.2,700 వరకు ఈ ఆఫర్ ద్వారా ఆదా చేయొచ్చు. ఈ ఆఫర్ మూడు ప్రధాన ఎల్పీజీ గ్యాస్ సర్వీసులందించే కంపెనీలైన హెచ్‌పీ, భారత్, ఇండెన్ గ్యాస్‌లకు వర్తిస్తుంది. ‘3 పే 2700’ ఆఫర్లో భాగంగా ఈ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. తాజాగా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటే.. రూ.3000 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. ఇందులో కనీసం రూ.900 కచ్చితమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంచింది.
ఇంకొన్ని ప్రయోజనాలు..
దీంతో పాటు వినియోగదారులు ఎవరైతే అనివర్య కారణాల వల్ల బుకింగ్ బిల్లు చెల్లించలేకపోతే.. పే లేటర్ ఆఫ్షన్‌ను కూడా అందిస్తోంది. పే లేటర్ ఆప్షన్ ఎంచుకుంటే.. వచ్చే నెలలో ఆ బిల్లును పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పేటీఎం ‘పోస్ట్ పేయిడ్’ సేవలు అందిస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏజెన్సీకి వెళ్లకుండానే గ్యాస్ బుక్ చేసుకునే వీలు కూడా కలుగుతోంది. దీని ద్వారా సులభంగా గ్యాస్ హోం డెలివరీ పొందొచ్చు.