కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరప్షన్‌లో టాప్ లెవల్లో దూసుకుపోతోందని చెబుతూ ఆ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. అక్కడి బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కానీ లంచాలు లేకుండా పనిచేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సీఎం బసవరాజు బొమ్మై అవినీతిని ఎండగడుతూ రాష్ట్ర రాజధాని బెంగళూరులో పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.
కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఫొటోతో కూడిన “PayCM” పోస్టర్లు బుధవారం బెంగళూరు సిటీలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. అవి ఎలక్ట్రానిక్ వాలెట్ Paytm కోసం ఇచ్చిన ప్రకటనల మాదిరిగానే ఉన్నాయి. QR కోడ్ మధ్యలో “40% ఇక్కడ ఆమోదించబడింది” అనే మెస్సేజ్‌తో పాటు బసవరాజ్ బొమ్మై ముఖం ప్రముఖంగా కనిపించేలా ఈ పోస్టర్లు రూపొందించారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న కొద్దిసేపటికే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్లను అధికారులు తొలగించారు.