రాజకీయాల్లో రాణించి అన్ని రకాల పార్టీల్లో ఆయన హవా కొనసాగించారు. నాటి నుంచి నేటి వైసీపీ వరకు పని చేసిన అనుభవం ఉంది ఆయనకి. ఇంతకీ ఆయనెవరో కాదు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.ఈయన ఇప్పుడు జనసేనలో చేరాలని అభిలాష. కాగా ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఓ బహిరంగ లేఖ రాసి..కీలకమైన సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని వైసీపీ కవ్విస్తోందని ఆ లేఖలో జోగయ్య అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా తాను అనుకున్నట్లుగానే వ్యవహరించాలని కూడా ఆయన సూచించడం విశేషం. పవన్ ని ఒంటరిగా పోటీ చేయమని వైసీపీ కవ్వించడం వెనక ఫక్తు రాజకీయాలే ఉన్నాయని జోగయ్య అభిప్రాయపడ్డారు. విడిగా విపక్షాలు పోటీ చేస్తే మళ్లీ వైసీపీదే అధికారమని ఆ పార్టీ మరోమారు పవర్ లోకి వస్తే ఏపీ అంధకారమే అన్నారు. అందువల్ల పవన్ తాను ఆవిర్భావ సభలో చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా చూడాలని ఆ దిశగా నడుము బిగించాలని కూడా జోగయ్య కోరారు. టీడీపీతో పాటుగా బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని జోగయ్య సలహా ఇచ్చారు. ఈ మూడు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుని బరిలోకి వస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తాయని కూడా జోగయ్య జోస్యం చెప్పారు. కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి చేస్తున్న ఆర్ధిక సాయాన్ని ఆయన ప్రశంసించారు. రానున్న రోజులలో రైతుల సంక్షేమానికి జనసేన ఏం చేస్తుంది అని కూడా చెప్పి జనంలోకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని జోగయ్య పవన్ కి సూచించారు. మొత్తానికి పెద్దాయన మద్దతు ..సలహాలు జనసేనకు ఇపుడు ఫుల్ జోష్ లో ఉంచేలా చేస్తున్నాయి. కాపు సంక్షేమ సేన తరఫున జోగయ్య రాసిన ఈ లేఖ ఇపుడు ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది. సింహం సింగిల్ గానే వస్తుంది.మరి పెద్దాయన సలహాన్ని పవన్ కల్యాణ్ పాటిస్తారా..ఆయన్ని పార్టీలో చేర్చుకుంటారా అనేది చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement