Thursday, November 21, 2024

Bhoiguda Tragic Fire: వలస కార్మికుల సజీవ దహనం బాధాకరం: పవన్

సికింద్రాబాద్ బోయగూడ ప్రాంతంలోని టింబర్ డిపోలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం కావడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువు బారిన పడటం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement