Monday, November 25, 2024

మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే – ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి – మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్శ క్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుందన్నారు. తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివని, మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదన్నారు. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని,అదే సత్యమన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లతాయని ధృడంగా విశ్వసిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతానన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేయడంతో పాటు ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విషయం ఆడపడుచులు అందరికీ విదితమేనన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ల దిశగా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని మీకు సవినయంగా విన్నవిస్తున్నానని మహిళామణులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement