Monday, November 18, 2024

బ్లాక్ ఫంగ‌స్ కి – ప‌తంజ‌లి మెడిసిన్

ఒమిక్రాన్, క‌రోనాల‌తో పాటు ప‌లు ర‌కాల ఫంగ‌స్ లు కూడా జ‌నాల‌కి సోకుతున్నాయి. కాగా బ్లాక్ ఫంగ‌స్ చికిత్స కోసం ప‌తంజ‌లి ఆయుర్వేద మెడిసిన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. అనూ తైల పేరుతో ముక్కుద్వారా ఈ మందును ఇస్తార‌ని ప‌తంజ‌లి సంస్థ వెల్ల‌డించింది. అధునాతన సాంకేతిక పద్ధతులతో పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘అనూ తైల’ మందును కనుగొందని వివ‌రించింది. ఈ నాసల్ డ్రాప్స్ యాంటీ ఫంగల్ ప్రభావాన్ని మైక్రోబయాలాజికల్, సైటోలాజికల్, అనలైటికల్ కెమికల్ పద్ధతిలో తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా సోకిన తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ పై మందు సమర్థంగా పనిచేసినట్టు తమ పరిశోధనల్లో తేలిందన్నారు. అనూతైలను ఎక్కువసార్లు అప్లై చేయడం వల్ల బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు లేకుండా పోయాయన్నారు. ప్రస్తుతమున్న బ్లాక్ ఫంగస్ ఔషధం యాంఫోటెరిసిన్ బీతో పోలిస్తే అనూతైల బాగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement