ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ భారత్‌లో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులను చూసి చలించిపోయాడు. కరోనాతో బాధపడుతున్న రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు కోసం పీఎం కేర్స్‌కు దాదాపు 50వేల ఆస్ట్రేలియన్ డాలర్లను అంటే భారత కరెన్సీలో రూ.52 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా కమ్మిన్స్ వెల్లడించాడు. అంతేకాకుండా తోటి ఆటగాళ్లు కూడా భారత్‌కు సహాయం చేయాలని కోరాడు. ఈ విరాళంతో ప్యాట్ కమ్మిన్స్ భారత ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
కానీ ప్యాట్ కమ్మిన్స్ విరాళంపై భారత అభిమానులు ఓ సూచన చేశారు. పీఎం కేర్స్‌కు కాకుండా వేరే స్వచ్ఛంద సంస్థలకు ఆ విరాళాన్ని అందజేయాలని కమ్మిన్స్‌ను అభిమానులు కోరుతున్నారు. గత ఏడాదిగా పీఎం కేర్స్‌కు చాలామంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారని, కానీ వాటిని కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.