Thursday, November 21, 2024

అనారోగ్యంతో మృతి చెందిన భోగేశ్వ‌ర్ – అంత్యంత పొడ‌వైన దంతాలు క‌లిగిన ఏనుగు

భోగేశ్వ‌ర్ మృతి చెందింది..భోగేశ్వ‌ర్ అంటే మ‌నిషి కాదు ..ఏనుగు. జూన్ 11న బందీపూర్-నాగర్‌హోల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని కబిని రిజర్వాయర్ సమీపంలో భోగేశ్వర ఏనుగు నిర్జీవంగా కనిపించింది. భోగేశ్వర అనారోగ్యంతో మృతి చెందింది. భోగేశ్వరను మిస్టర్ కబిని అని కూడా పిలుస్తారు. ఈ ఏనుగు వయస్సు 70 ఏళ్లు. అంత్యంత పొడవైన దంతాలతో భోగేశ్వర్ పర్యాటకులందరినీ అలరించేది. అందరి దృష్టిని ఆకర్షించేది. ఆ ఏనుగు మృతి చెందండంతో అందరిని కలచివేస్తోంది. ఇక ఏనుగు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించామని కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ డైరక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏనుగు దంతాలను భద్రపరచడానికి అనుమతి పొందాలని అటవీశాఖ యోచిస్తోంది. భోగేశ్వర దంతాల్లో ఒకటి 2.54 మీటర్లు (8 అడుగులు) పొడవు, మరొకటి 2.34 మీటర్లు (7.5 అడుగులు) ఉంటాయి. రెండు దంతాలు దాదాపుగా నేలను తాకే విధంగా ఉండేవి. భోగేశ్వర్ శిబిరం సమీపంలో దేవాలయం దగ్గర ఆ ఏనుగు తరచుగా కనిపిస్తుండేది. దాంతో అటవీ శాఖ సిబ్బంది దానికి భోగేశ్వర అని పేరు పెట్టారు. భోగేశ్వర దంతాల నమూనాలను మైసూరులోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపించారు. ఏనుగు సహజ కారణాలతోనే, అనారోగ్యంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. అలాగే ఏనుగు శరీరంపై ఎటువంటి గాయాలకు సంబంధించిన గుర్తులు లేవని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement