Tuesday, November 19, 2024

డిజిటల్‌ వైపు TSRTC.. బస్సుల్లో కార్డుల ద్వారా చెల్లింపులు!

తెలంగాణ ఆర్టీసీ మరో సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో టెక్నాలజీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు గ్రేటర్‌ జోన్‌ వ్యాప్తంగా బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు టిక్కెట్ల రిజర్వేషన్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపునుల ప్రోత్సహిస్తున్నారు.

తాజాగా ఇకపై బస్సుల్లో టిక్కెట్ తీసుకునే సమయంలో ప్రయాణీకులు డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు(స్వైపింగ్) చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ సౌకర్యాన్ని ముందుగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి జిల్లాలకు నడుపుతున్న బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. నగరం నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో కార్డు చెల్లింపులతో టికెట్లు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే చిల్లర కష్టాలకు తెర దించడంతో పాటు టికెట్ల రాబడి నేరుగా ఆర్టీసీ బ్యాంక్‌ ఖాతాలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో భాగంగా 900 బస్సుల్లో కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ఫలితాల ఆధారంగా అన్ని బస్సుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement