జార్ఖండ్ కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్ కొంగరి.. భారీ మొత్తంలో డబ్బుతో బెంగాల్లోని హౌరాలో వీరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జార్ఖండ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అవినాశ్ పాండే వెల్లడించారు. నల్ల కారులో పెద్దమొత్తంలో నగదు రవాణా అవుతుందని సమాచారం అందడంతో హౌరా జిల్లాలోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగాల్ వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు సోదా చేయగా పెద్దమొత్తం డబ్బు బయటపడింది. అవి జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరివిగా గుర్తించారు. కారులో ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
నోట్ల కట్టలతో పట్టుబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు
Advertisement
తాజా వార్తలు
Advertisement