Wednesday, November 20, 2024

పార్ల‌మెంట్ లో క‌రోనా క‌లక‌లం – ఏకంగా 850మంది సిబ్బందికి పాజిటీవ్

త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్ల‌ని పూర్తి చేస్తోంది. కాగా పార్ల‌మెంట్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఒక‌రిద్ద‌రు కాదు ఏకంగా 850మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా పాజిటీవ్ గా నిర్ధార‌ణ అయింది. వీరిలో 250మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్ల‌మెంట్ సిబ్బంది అధికంగా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతుండ‌టంపై పార్లమెంటు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ.. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎలాంటి లక్షణాలు లేని వారే విధులకు హాజరుకావాలనీ, స్వల్ప లక్షణాలు ఉన్నా విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ వారిలో ప‌లువురు హోం క్వారంటైన్ లో ఉండ‌గా, మ‌రికొంత మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అయితే, వీరంద‌రికీ ఒమిక్రాన్ సోకిందా? అనే అనుమానాలు సైతం వ్య‌క్తమ‌వుతున్నాయి. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement