ఈరోజు ఉదయం బడ్జెట్ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.. ఎన్నికల కారణంగా పార్లమెంటు సమావేశాలు, చర్చలు ఎప్పటికప్పుడు ప్రభావితమవుతాయని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఓపెన్ మైండ్‌తో చర్చలు జరుపుతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
కాగా, సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయని, ఫస్ సెషన్ మాత్రం ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుందని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.