నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుతం 36 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే.. అదానీ – ఎల్ఐసీ, బీబీసీ- మోడీ డాక్యుమెంటరీ వివాదంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టు పట్టనున్నాయి. అందుకు బదులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ పార్టీతో పాటు ఆప్ రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకావడం లేదు.కాగా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు, ఆ తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ ఆరు వరకు సమావేశాలు నిర్వహిస్తారు .27 సార్లు సభ సమావేశం కానుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. తొలిసారి ప్రసంగించనున్న ద్రౌపది ముర్ము
Advertisement
తాజా వార్తలు
Advertisement