Friday, November 22, 2024

నేపాల్ లో ఒకేసారి పార్ల‌మెంట్.. అసెంబ్లీ ఎన్నిక‌లు.. వారం రోజుల్లో ఫ‌లితాలు వెల్ల‌డి

పార్ల‌మెంట్ ..అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జ‌రుగుతున్నాయి నేపాల్ లో..కాగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. ఫలితాలు వారం రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు చెందిన నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పోటీ నెలకొన్నది. 2015 లో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలు ఇవి. నేపాల్ పార్లమెంట్‌లోని మొత్తం 275 స్థానాలు, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 550 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2015 లో ప్రకటించిన కొత్త రాజ్యాంగం తర్వాత ఇవి రెండో ఎన్నికలు.

దేశంలోని 1.80 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేపాల్‌లో జరుగుతున్న ఎన్నికల్లో భారత్‌ కూడా సహకరిస్తున్నది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓటింగ్ జరిగేలా భారత్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. నేపాల్‌తో భారత్, చైనా సరిహద్దులను మూసివేశారు. నేపాల్‌లో రాజకీయ అస్థిరత సర్వసాధారణంగా మారింది. 1990 లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. దాంతో 2008 లో రాచరికం రద్దయింది. 2006 లో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. తరచూ నాయకత్వ మార్పులు, రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పోరు కారణంగా అభివృద్ధి మందగిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేపాల్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు 30 ప్రభుత్వాలు మారాయి. 2008 లో రాచరికం ముగిసిన తర్వాత కూడా 10 ప్రభుత్వాలు మారడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement