పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన మొదటిరోజే మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టింది. ఆ రోజే రెండు సభలు ఆ బిల్లును ఆమోదించాయి. రాజ్యసభ నుంచి 12మంది ఎంపీలను ఈ సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు ధర్నాకు దిగారు. దాంతో వీరికి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సంఘీభావం చెప్పాయి. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ ఎంపీ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ధర్నాకు దిగిన 12 మంది ఎంపీలకు సంఘీభావం తెలిపారు. నేడు వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడారు. అనంతరం, వారికి స్నాక్స్ పంచి ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాడటానికి, నిరసన చేయడానికి శక్తి అవసరం అని ఆమె చెప్పారట. అందుకే ధర్నాకు దిగిన 12 మంది ఎంపీలకు ఆమె స్నాక్స్ పంచి పెట్టారు. టీ, బిస్కెట్లు కూడా ఇచ్చారట.
Advertisement
తాజా వార్తలు
Advertisement