పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాగా కేజ్రీవాల్ భార్య సునీత, కుమారై హర్షితలు కూడా పంజాబ్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొననున్నారట. వచ్చే వారంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు శుక్రవారం వారు పంజాబ్‌కు రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ భార్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేపు నేను నా బావ భగవంత్ మాన్ కోసం ఓట్లు అడగడానికి నా కుమార్తెతో కలిసి ధురీ (సంగ్రూర్ జిల్లాలో) ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాను” అని కేజ్రీవాల్ భార్య సునిత ట్వీట్ చేశారు.
ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.ఫిబ్రవరి 11న పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భగవంత్ మాన్ నిర్వహించే జన్ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత, కుమార్తెలు హాజరవుతారని ఆప్ వర్గాలు సైతం వెల్లడించాయి. భగవంత్ మాన్ తల్లి, సోదరితో పాటు ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ కుమార్తె కూడా పాల్గొంటారు. కాగా, ధూరి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన భగవంత్ మాన్‌ను.. ఫోన్‌లైన్ సర్వేలో 93 శాతం మంది అనుకూలంగా ఓటు చేయడంతో ఆయనను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సంగ్రూర్ స్థానం నుంచి ఆ పార్టీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..