Tuesday, November 26, 2024

పంజాబ్ లో సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న అప్పుడే – కేజ్రీవాల్

పంజాబ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితిపై సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని ల‌క్ష్యంగా చేసుకొని ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్. కాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్థిని గురువారం ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రధాన మంత్రి మోడీ భద్రతకు సంబంధించిన విషయమైనా లేదా సామాన్యుల భద్రత‌కు సంబంధించిన విషయమైన అందిరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. వచ్చే వారం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటారని గత ఏడాది అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement