సోలాపూర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మహారాష్ట్రలోని పండరీపుర్ ఆలయానికి చేరుకోనున్నారు. విఠోభ రుక్మిణి ఆలయాన్ని దర్శించి దేవతల ఆశీస్సులు తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా రైతులు అంతా క్షేమంగా ఉండాలని ఆయన ప్రార్ధించనున్నారు.
1108-1158 మధ్య కాలం అప్పటి చక్రవర్తి విఠలేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆషాడ మాసం వేళ .. తొలి ఏకాదశి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తారు. స్థానిక భక్తులు పాదయాత్ర చేస్తారు.ఆ పాదయాత్రను వార్కా అంటారు. వారీనే వార్కర్లు అంటారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రత్యేకత సంతరించుకున్నది.ప్రత్యేక పూజల తర్వాత సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవాన్ని ఆలయాన్ని దర్శిస్తారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు భారీ స్థాయిలో పండరీపురం చేరుకున్నారు.
నిన్న హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన వెళ్లిన ఆయన సోమవారం రాత్రి సోలాపూర్‌లో బస చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో ఆయన ఆలయాన్ని సందర్శించనున్నారు