Saturday, November 23, 2024

విక్రాంత్ రోణ మూవీ రివ్యూ-ఎలా ఉందంటే..

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ న‌టించిన చిత్రం విక్రాంత్ రోణ‌. వీ.ఆర్ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కన్నడ హీరో అయినా సుదీప్ దాదాపు అన్ని భాషల వారికి పరిచయమే. తెలుగులో ఈగ సినిమాతో విలన్ గా పరిచయమయ్యారు. దాంతో సుదీప్ చేస్తున్న దాదాపు చాలా సినిమాల డబ్బింగ్ అవుతున్నాయి. అయితే నేరుగా ఇప్పటివరకు సుదీప్ ఏ సినిమాతోనూ మళ్ళీ తెలుగులో హీరోగా రాలేదు. మధ్యలో బాహుబలి, సైరా వంటి సినిమాలలో అడపాదడపా పాత్రలు చేశారు. ఇప్పుడు విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా రిలీజ్ తో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే.. కొమరట్టు అనే ఊరిలో వరస పెట్టి పిల్లలు చనిపోతూంటారు. ఆ కేసులు ఇన్విస్టిగేట్ చేయాల్సిన పోలీస్ కూడా చనిపోతారు. ఒక ఇంటి ఆవరణలోని బావిలో ఆ బాడీ దొరుకుతుంది. కానీ, తల దొరకదు. కొన్నేళ్ల కింద అదే ఊళ్ళో నిట్టోని అనే వ్యక్తి కుటుంబాన్ని.. గుడి నగలు దొంగిలించారనే నెపంతో కొట్టి తరిమేసి ఉంటారు ఆ ఊరి జనం. ఆ అవమానంతో నిట్టోని కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడుతుంది. వాళ్ళ ఆత్మలే ఊళ్ళో పిల్లల్ని చంపేస్తున్నాయని అంతా అనుకుంటారు. అసలు నిజం ఏమిటి…అనేదే విక్రాంత్ రోణ క‌థ‌..

మూవీ విశ్లేషణ.. కామెడీ, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి వండిన స్క్రిప్టు ఇది. కథగా ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాదు కానీ ఎంగేజ్ చేస్తుంది. అలాగే అన్ని ఎలిమెంట్స్ కావాలని కథలోకి దూర్చే ప్రక్రియలో చాలా చోట్ల ప్లాట్ గా తాయరైంది. నవ్వురాని కామెడీని కాస్త ప్రక్కన పెడితే బాగుండేది. ఫస్టాఫ్ ఆగకుండా వెళ్లిపోయినా సెకండాఫ్ లో కథ ఏంటో పూర్తిగా రివీల్ అవుతూంటే గ్రిప్ మెల్లిగా తగ్గటం మొదలైంది. కొన్ని చోట్ల కాస్త అర్దమయ్యేలా చెప్తే కన్ఫూజింగ్ తగ్గేదేమో అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే పరంగా చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది. రొటీన్ పగ,ప్రతీకారం కథకే కాస్తంత హారర్ కలర్ కలిపారు అనిఅర్దమవుతుంది. మొదట్లో కొన్ని హత్యలు, అక్కడికి ఓ పోలీస్ అధికారి రావటం, రకరకాల క్యారక్టర్స్ పై అనుమానాలు, చివరకు ఎవరూ ఊహించని ఓ పాత్రను ప్రవేశపెట్టి వాడే అసలు విలన్ అనే తేల్చటం …అనే ఫార్మెట్ లోనే వెళ్లిపోయారు.

- Advertisement -

టెక్నికల్ గా ఎలా ఉందంటే .. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది ఈ చిత్రం. ఈ సినిమా మేజర్ గా ఇండోర్స్ లో ఎక్కువ షూట్ చేసారు. మిగతా సినిమాలో దట్టమైన అడవి తప్పించి పెద్దగా లొకేషన్స్ ఏమీ కనపడవు. ఎక్కువగా VFX మీదే ఆధారపడ్డారు. అవి హై స్టాండర్డ్స్ లోనే చేసారు. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది అజనీష్ లోక్‌నాథ్‌ సౌండ్ డిజైన్ మెచ్చుకోవాలి. కొన్ని హారర్ సీన్స్ లో కొత్తగా భయపెట్టారు. కొన్ని చోట్ల ఏదో జరగబోతోందనే ఆలోచన, ఉత్కంఠ క్రియేట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫెరఫెక్ట్ . పాటల్లో .. ‘రా రా రక్కమ్మ’ సినిమా రిలిజ్ కు ముందే సూపర్ హిట్. మిగతా పాటలు సోసో. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతోంది. చాలా సీన్స్ వండ‌ర్‌ఫుల్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో నచ్చుతాయి.

న‌టీ న‌టులు..సుదీప్ యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయింది. సినిమా చాలా భాగం వాటిపై బేస్ అవుతుంది. ఆయన హీరోయిజం సీన్స్ కన్నడ వాళ్లకు నచ్చుతాయి . హాట్ లుక్‌లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాడైజ్ విషయానికి వస్తే ఆమె నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తే నిరాశే. ఆమెకు అంత స్క్రీన్ టైమ్ ఇవ్వలేదు. పొడిగించిన గెస్ట్ రోల్ లాంటిది. ఉన్నకాసేపు అందచందాల‌తో ప్రేక్షకుల మ‌న‌సుల‌ను దోచుకుంది. ‘రా రా రక్కమ్మ’ కు హాల్ కాసేపు ఊగింది. తెలుగు మొహాలు ఏమీ పెద్దగా లేవు. సో మొత్తానికి ఈ చిత్రం చూసేవారి విధానం బ‌ట్టి జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement