Friday, November 22, 2024

కెమెరాకి చిక్కిన బీటౌన్​ చిన్నది.. ఎందుకా భయం అంటున్న నెటిజన్లు..

శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ,  సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ శుక్రవారం రాత్రి ముంబైలోని ఒక రెస్టారెంట్ నుండి బయలుదేరిన ఫొటోలు లీకయ్యాయి. కాగా, కెమెరా ఫ్లాష్‌లతో  పాలక్ తన ముఖాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది.

‘‘హార్డీ సంధు హిట్ నంబర్ బిజిలీ బిజిలీ’’లో ఇటీవల కనిపించిన 21 ఏళ్ల పాలక్ తివారీ శుక్రవారం రాత్రి ముంబైలోని బాంద్రాలో ఒక రెస్టారెంట్​ నుంచి  బయటకు వెళ్లడం కనిపించింది. ఆమె వెంట సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఉన్నాడు. పాలాక్, ఇబ్రహీం రెస్టారెంట్ నుండి బయలుదేరిన వీడియోను నెట్​లో కొంతమంది షేర్​ చేశారు. కాగా, పాలక్ తన ముఖాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని అభిమానులు గుర్తించారు. వీడియోలో ఇబ్రహీం కారులోకి ఎక్కడం,  అలాగే ఫొటోగ్రాఫర్‌ల వైపు చేయి ఊపడం చూడవచ్చు. అయితే పాలక్ ను ఫొటో తీయడానికి ప్రయత్నిస్తున్న వారి నుంచి  ఆమె ముఖాన్ని కవర్ చేయడానికి ట్రై చేసినా అది వీలు కాలేదు. బి-టౌన్‌లో వారు సరికొత్త జంట అని చాలా  గాసిప్స్​ వినిపిస్తున్నాయి.

మమ్మీకి భయపడే ముఖం దాచుకుందా.. నెటిజన్ల వెటకారం..

చాలా మంది అభిమానులు ఈ వీడియోపై కామెంట్స్ పెట్టారు. కెమెరా ను చూసి ఇబ్రహీం నవ్వుతున్నప్పటికీ, ఆమె తన ముఖాన్ని ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తుందో అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఒక అభిమాని ఆమె తల్లి శ్వేతా తివారీ తిడుతుందని భయపడిందేమో అందుకే అలా ముఖం దాచుకున్నట్టుంది అని వెటకారం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement