మిల్కీబ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15సంవత్సరాలు దాటుతుంది. అయినా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పలు సినిమాలతో బిజీగానే ఉందీ బ్యూటీ. కాగా ఇండస్ట్రీలో ఎఫైర్స్ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడలాంటి వార్తే హల్ చల్ చేస్తుంది. పాకిస్థానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల అబ్దుల్ రజాక్ తో కలిసి దుబాయ్ లోని ఓ జ్యూయలరీ షాప్ కు తమన్నా వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఎంగేజ్ మెంట్, పెళ్లికి అంతా సిద్ధమయిపోయిందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్నా చెప్పినప్పటికీ… వీరి ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..