గుజరాత్ తీరంలో భారత జలాల్లో పాకిస్థాన్ బోట్ ని ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నట్లు రాష్ట్ర రక్షణ ప్రతినిధి చెప్పారు. భారత సముద్ర సరిహద్దు తీరం నుంచి 11కిలోమీటర్ల దూరంలోకి ఈ యాసిన్ అనే బోట్ రావడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించాడు. బోట్ వైపు కోస్ట్ గార్డ్ షిప్ వెళ్తుండగానే ఆ బోట్ ని తప్పించే ప్రయత్నం చేశారు. దాంతో వారిని పట్టుకున్నారు ఇండియన్ కోస్ట్ గార్డులు. సముద్రంలో 10 మంది సిబ్బందితో యాసిన్ అనే బోట్ వచ్చింది. దానిని ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అంకిత్ పట్టుకుంది. తదుపరి విచారణ కోసం బోటును పోర్ బందర్‌కు తీసుకువచ్చాం’’ అని ఆ అధికారి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..