మహిళలకి ఎన్నో ఆంక్షలు విధించే పాకిస్థాన్ లో ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక మహిళ నియమితురాలవ్వడం విశేషం. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ ఆయేషా మాలిక్ నియమితురాలవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలో పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఐదు ఓట్ల మెజార్టీతో ఆయేషా మాలిక్ ని ఆమోదించింది. కాగా ఆయేషా లాహోర్ లోని ‘పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా’లో ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.
ఆ తర్వాత లండన్ లోని హార్వర్డ్ లా స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం కరాచీలో న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత తన కెరీర్ లో పలు జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్, హైకోర్టుల్లో సేవలందించారు. ఆమె ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. కాగా పాకిస్థాన్ చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని చెప్పాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..