అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశం విడిచి వచ్చిన పౌరులను పాకిస్థాన్ బహిష్కరించింది. సుమారు 200 మందిని తిరిగి అఫ్గానిస్థాన్‌కు పంపించింది. ఇకపై అక్రమంగా వచ్చే ఏ అఫ్గాన్ పౌరుడినీ దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.
అఫ్గాన్‌లోని కుందుజ్ రాష్ట్రానికి చెందిన 200 మంది పౌరులు తాలిబన్లకు భయపడి వివిధ సరిహద్దు పాయింట్ల గుండా పాకిస్థాన్‌లోకి వచ్చారు. కొంతకాలం ఓ రైల్వే స్టేషన్లో తలదాచుకున్నారు. ఎక్కువ రోజులు ఉండేందుకు అధికారులు అనుమతించని నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రెండు రోజుల క్రితం వీరు క్వెట్టాకి చేరుకున్నారు. అయితే అక్కడ కూడా వారిని ఉండేందుకు అధికారులు అనుమతించలేదు. అనంతరం వారిని అఫ్గాన్‌కు తిరిగి పంపించారు. మొత్తం 200 మందికి పైగా అఫ్గాన్ పౌరులు ఉండగా.. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు వారిని దేశ బహిష్కరణ చేశామని క్వెట్టా డివిజన్ కమిషనర్ సోహెయిల్ ఉర్ రెహ్మాన్ బలోచ్ తెలిపారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చేంతవరకు పాక్‌లోకి అక్రమంగా చొరబడే ప్రతి అఫ్గాన్ పౌరుడిని వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ఇకపై ఈజీగా సిలిండర్..