Tuesday, November 26, 2024

IND VS PAK: పాక్‌ బౌలర్లు ఆధిపత్యం.. వికెట్లు కోల్పోతున్న భారత్

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడుతున్నది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే స్టార్‌ బాటర్‌ షఫాలీ వర్మ డకౌట్‌ అయింది. నాలుగు పరుగుల వద్ద ఓపెనర్ షెఫాలీవర్మ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి స్మృతి మందన ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. భారత ఓపెనర్ స్మృతి మందన అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. దీప్తి శర్మ, స్మృతి మందన జట్టుకు ఆదుకున్నారు. అయితే కొన్ని పరుగుల తేడాతోనే వారిద్దరు ఔటవడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఇద్దరూ కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన తర్వాత 57 బంతుల్లో రెండు ఫోర్లతో 40 పరుగులు చేసిన దీప్తి శర్మ అవుటైంది.  ఆ వెంటనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి (52) కూడా పెవిలియన్ చేరింది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సీనియర్‌ బ్యాటర్లు మిథాలీ రాజ్ (9)‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5) స్కోర్‌ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తర్వత వచ్చిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ రిచా గోష్‌ (1) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో భారత్‌ 44 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement