Monday, November 18, 2024

Terror: టెర్రర్​ లీడర్​ సాజిద్​ మీర్ అరెస్టు.. ముంబై ఉగ్రదాడి 26/11లో ఇతనే సూత్రధారి

26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్‌ను పాకిస్థాన్ ఇవ్వాల (శుక్రవారం) అరెస్టు చేసింది. అతను కొన్నాళ్ల క్రితమే చనిపోయినట్టు ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన పాకిస్థాన్​ ఇవ్వాల ఎట్టకేలకు అతడిని అరెస్టు చేయడం గమనార్హం. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన అగ్రశ్రేణి లీడర్ అయిన​ మీర్ తలపై $5 మిలియన్ల రివార్డు ఉంది. ఇంకా అతను FBI మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు. ముంబై దాడుల్లో మొత్తం 166 మంది చనిపోయారు. ISI మద్దతుతో దాడులు చేసిన వారి కోసం ప్రత్యక్షంగా సన్నాహాలు, నిఘాలో మీర్ హెల్ప్​ చేసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు ముంబైలో ఉన్నప్పుడు అతని ద్వారానే పాకిస్థాన్​ నుంచి కీలక ఆదేశాలు జరీ అయినట్టు సమాచారం.

అయితే.. గతంలో తమ దేశంలో మీర్​ అనే వ్యక్తి ఎవరూ లేరని పాకిస్థాన్​ చెబుతూ వచ్చింది. అంతేకాకుండా అతను తమ దేశానికి చెందినవాడే కాదని దాడుల ఘటనను తమపై రుద్దేందుకు ఇలా చేస్తున్నారని కొట్టిపారేసింది. ఆ తర్వాత కొంతకాలానికి మీర్​ చనిపోయాడని పేర్కొంది పాకిస్థాన్​. ఇక.. గ్లోబల్ కమ్యూనిటీ నుండి ముఖ్యంగా G-7 యొక్క మనీ-లాండరింగ్ వ్యతిరేక సంస్థ ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ (FATF) నుండి ఒత్తిడి తీవ్రం అయినప్పుడు కూడా ఇదే విషయాన్ని పాకిస్తాన్ వెల్లడించింది.

ముంబై దాడులకు పాల్పడ్డ వారిలో కీలక నేత మీర్​ పాకిస్థాన్​లోనే ఉన్నాడని చాలా సాక్ష్యాలున్నప్పటికీ ఆ దాడి చేసినవారు పాకిస్థానీ వ్యక్తులు కాదని, పాకిస్థాన్​ కొట్టిపారేసింది. దాడి తర్వాత సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్ కూడా తమ దేశస్తుడు కాదని పాక్​ తొలుత తెలిపింది. కానీ, కసబ్ ఒకారా జిల్లా ఫరీద్‌కోట్‌కు చెందినవాడని ఆధారాలతో రుజువు అయ్యే దాకా ఇట్లాంటి మాటలే బొంకింది పాకిస్థాన్​.  ఇక.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యొక్క పర్యవేక్షణలో ఉన్న దేశాల “గ్రే లిస్ట్”లో పాకిస్థాన్ ని చేర్చినట్టు పారిస్‌కు చెందిన గ్లోబల్ మనీలాండరింగ్, టెర్రర్-ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement