సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఓ పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చివేసింది. పంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేసింది. అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో డ్రోన్ శబ్దానికి అప్రమత్తమై.. దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్‌కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్ ఉన్నాయని వెల్లడించారు. అలాగే జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement