Friday, November 22, 2024

Paddy procurement: వరి ధాన్యం కొనుగోలు చేయకుండా మాపై నిందలా ?

యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు తెలంగాణ రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలు,మంత్రులు,అధికారులు, అందరం కలిసి కేంద్ర మంత్రిని కలుస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారని అన్నారు.

పట్టిచ్చిన బియ్యం తమ దగ్గర ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు. రాష్ట్రం పట్టిచ్చిన బియ్యంను కేంద్రమే  తీసుకువెళ్లాలని అన్నారు. కానీ తీసుకు వెళ్లకుండా ఉల్టా మమ్ములను అనడం విడ్డురంగా ఉందన్నారు. రైల్వే రేకులను సమకూర్చుమంటే సమకూర్చలేదని, మళ్ళీ తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల నుండి స్పష్టమైన హామీ రాకపోతే మా భవిష్యత్ కార్యాచరణను ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. ఇవాళ తనతోపాటు మంత్రులుపువ్వడా అజయ్,ప్రశాంత్ రెడ్డి,గంగుల కమలాకర్ వెళ్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement