ప్రస్తుత కరోనా కాలంలో ఆక్సిజన్ విలువ ప్రతి ఒక్కరికీ తెలిసివస్తోంది. ప్రాణవాయువు సకాలంలో అందకపోవడంతో కొవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను ఎంత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని విజయవాడలోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై గడ్డకట్టి పేరుకుపోతోంది. ఇటీవల విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకై గాల్లో కలిసిపోయింది. అయినప్పటికీ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. అదే ఆసుపత్రిలో ఉన్న మూడు ట్యాంకుల నుంచి నిత్యం ఆక్సిజన్ లీకై గడ్డకట్టి పేరుకుపోతోంది. పేరుకుపోయిన ఆక్సిజన్ మంచుకొండను తలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు ఆక్సిజన్ లీకేజీని అరికట్టి రోగులకు అందేలా చూడాలని కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement