కరోనా వేళ మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. నాసిక్‌లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ కారణంగా 22 మంది రోగులు చనిపోయారు. ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లీకవుతున్న ఆక్సిజన్ ను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. లీకేజీ ఘటనతో సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. బాధితులంతా వెంటిలేటర్లపై ఆధారపడి ఉన్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని.. ఆక్సీజన్ అందక 22 మంది మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్సీజన్ లీక్‌పై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
నాసిక్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రాథమిక సమాచారం మేరకు 22 మంది మరణించినట్లు తెలుస్తోందని మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగానే తెలిపారు. ఈ ఘటన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు.