ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోల్హాపూర్ లో కర్ఫ్యూ విధించారు.
ఈ ఘర్షణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ” అకస్మత్తుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు సంతానం జన్మించింది. వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టి, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారని, దీంతోనే కొల్హాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వారు ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలను మేము కనుగొంటాం”అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ”మీరు అంత నిపుణులని తెలియదని.. గాడ్సే, ఆప్టే పిల్లలు కూడా ఎవరో తెలుసుకోవాలి” అంటూ సెటైర్లు వేశారు.