ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కాగా ఒక్క యూఎస్ లోనే ఈ సినిమాను 1150కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఈ స్థాయి లొకేషన్స్ లో రిలీజ్ అవుతుండటం ఇదే ఫస్టు టైమ్ అనీ .. ఆ రికార్డు రాజమౌళికి దక్కిందని అంటున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచే అక్కడ షోస్ మొదలవుతాయి. ప్రపంచంలోని అతి పెద్ద స్క్రీన్ గా చెప్పుకునే యూకే లోని ఐమాక్స్ తెరపై ఈ సినిమా ప్రీమియర్ షో పడుతుండటం కూడా ఒక రికార్డుగా చెబుతున్నారు. ఇలా కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించగా .. ఆయన మనసు దోచిన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..