Friday, November 22, 2024

పాపం చైనాది.. ఫలితం ప్రపంచానిది.. భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్

అంతరిక్షంలో చైనా కొత్తగా స్పేస్ స్టేషన్ (తియాన్హే) నిర్మించాలని తలపెట్టింది. దీని కోసం ఏప్రిల్ 29న ఆ దేశానికి చెందిన 100 అడుగుల లాంగ్ మార్చ్ 5బీ అనే రాకెట్ తియాన్హే స్సేస్ స్టేషన్ మాడ్యూల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. ఇప్పుడు లాంగ్ మార్చ్ రాకెట్ శకలాలు పొరపాటున ఓ తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అవి భూమిపై పడనున్నాయి. కానీ కచ్చితంగా ఎక్కడ పడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పటికే 80 కిలోమీటర్లు కిందకు పడిపోయినట్లు స్పేస్ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఇది భూమిపై పడే అవకాశాలు 71 శాతం ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. మే 8న భూ కక్ష్యలోకి ప్రవేశించే అవకాశముందని చెప్తున్నారు.

యూఎస్ స్పేస్ కమాండ్ ఈ రాకెట్‌ను ట్రాక్ చేస్తోంది. స్పేస్ ట్రాక్ డాట్ ఆర్గ్‌లో రాకెట్ బాడీ లొకేషన్‌పై అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రాకెట్ 90 నిమిషాల్లో భూమిని ఒకసారి చుట్టేస్తోంది. అంటే సెకన్‌ను ఏడు కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తోంది. అంతరిక్షం నుంచి ఏదైనా భూమిపైకి వచ్చేటప్పుడు ఏర్పడే వేగం కారణంగా చాలావరకు గాలిలోనే మండిపోతాయి. కానీ ఇంత భారీ రాకెట్ భూమిని తాకనున్నట్లు అంచనాలు వేస్తుండటంతో భూమిపై మహాసముద్రాలు లేదా నిర్మానుష్య ప్రదేశాల్లో అది పడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement