ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీకి గౌరవం ఇస్తోంది, ఇది మనకు గర్వకారణం, అలాంటి ప్రధాని మనవారని గర్వపడాలని మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం ఎవరి చేతుల్లో ఉంది. .. ఈ ప్రాంతంలో, ప్రతిచోటా అభివృద్ధి జరుగుతోందని యూపీలో ఎన్నికల ప్రచారంలో ఆమె అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు.రొమేనియా ద్వారా భారతీయులను తిరిగి దేశానికి తీసుకురానున్నారు. వాస్తవానికి, భారత ప్రభుత్వం రెస్క్యూ మిషన్‌ను ముమ్మరం చేసిందన్నారు.. భారతీయులను ఉక్రెయిన్‌కు తీసుకువచ్చే విమానాలు సిద్ధం చేశారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు, ఢిల్లీ , ముంబై నుండి విమానాలు కొంచెం ఆలస్యంగా బయలుదేరుతాయని ఇందతా మన ప్రధాని సంకల్పం వల్లే జరుగుతుందన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపాలని మోడీ ప్రయత్నించారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..