తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే సభపై ఉత్కంఠ నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ వినతి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వినతిని తరస్కరిస్తున్నట్లు ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సభ నిర్వహణ డైలామాలో పడింది.
కాగా, మే 6న తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ.. అదే రోజున వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ మరునాడు హైదరాబాద్‌లో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ అధికారులను కోరింది. అయితే, ఈ ప్రతిపాదనపై సుధీర్ఘంగా ఆలోచన చేసిన ఓయూ గవర్నింగ్ కౌన్నిల్.. రాహుల్ గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో సభ నిర్వహిస్తారా? లేదా? అన్నది చూడాలి.